FILTERS:
SORT BY:
సమాచారం అందరికీ అందుబాటులో ఉన్న ఇప్పటి ప్రపంచంలో, విద్య స్ఫూర్తిదాయకం కావాలి కానీ, కేవలం విషయ సేకరణ కాకూడదు.
మీలో నిరంతరం రెండు ప్రాథమిక శక్తులు పనిచేస్తూ ఉంటాయి: ఒకటి ఆత్మరక్షణ, రెండవది విస్తరించాలనే తపన. మీరు ఎప్పుడైతే ఈ ఆత్మరక్షణ అనే సహజాతాన్ని అధిగమిస్తారో, అప్పుడు మీ శరీరంలోని ప్రతి కణం ఎంతో హాయిని పొందుతుంది.
మీ ప్రాణశక్తిలో ఉత్తేజాన్ని, మీ మనసులో నూతనత్వాన్ని, మీ గుండెల్లో ప్రేమని నిలుపుకుంటే, ప్రతి రోజు ఒక కొత్త సాహసమే.
మీరు తర్కానికి బానిసైనప్పుడు, జీవితంలోని అద్భుతాన్ని పోగొట్టుకుంటారు. మనుషుల్ని తర్కం అనే చట్రం దాటించి, మన అస్తిత్వంలోని అసలైన అద్భుతం వైపు నడిపించడమే నా పని.
జీవం కంటే గొప్ప లక్ష్యం మరొకటి లేదు.
మీలో కోపం, పగ, అసూయ లేనప్పుడు, మీరు దేనిని తాకినా ప్రేమగానే తాకుతారు.
మీరు ఎవరన్నది పరిస్థితులు నిర్ణయించకుండా – పరిస్థితులు ఎలా ఉండాలో మీరే నిర్నయిస్తే అది అసలైన విజయం.
జీవితం, మీరు ఏమి చేశారు అన్న దాని గురించి కాదు. అదంతా మీరు దాన్ని ఎలా చేశారు అన్న దాని గురించే.
రేపు ఎలా జరుగుతుందనేది, ఈ రోజు మీ ఆలోచన, మీ భావన, ఇంకా జీవితాన్ని మీరు చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది.
జీవితాన్ని ఎలా స్వీకరించాలో తెలిసిన వారికి అది ఎంతో ఉదారంగా ఉంటుంది. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిన వారు పరిపూర్ణతను అనుభవిస్తారు. ఈ ‘ధన్య పూర్ణిమ’ శుభవేళ, మీరు జీవితపు ఉదారతను స్వీకరించడానికి సంసిద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాను.
రేపు అనేది ఎప్పటికీ రాదు, అదే జీవితంలోని సౌందర్యం. మీరు కేవలం ఈ రోజును ఎలా నిర్వహించుకోవాలో నేర్చుకుంటే చాలు. ఏరోజుకారోజు, ఏ క్షణానికి ఆక్షణం.
ఓ బలమైన దేశాన్ని నిర్మించాలంటే, స్పష్టమైన దూరదృష్టి, అంకిత భావం, ఇంకా సరైన పనులు చేసేందుకు కావాల్సిన ధైర్యంతో మనం దానిని తీర్చిదిద్దాలి. ఈ భూమ్మీద భారతదేశం అత్యంత తేజోవంతమైన దేశంగా ఎదగాలంటే, మనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.